నా దృష్టిలో ఎమ్మెల్సీ పదవే కాదు – కోదండరాం హాట్‌ కామెంట్స్‌

-

నా దృష్టిలో ఎమ్మెల్సీ పదవే కాదంటూ కోదండరాం హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇవాళ ఎమ్మెల్సీ గా ప్రమాణం చేసిన అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ…. గవర్నర్, సీఎంకు కృతఙతలు చెప్పారు. మండలి చైర్మన్ కు పర్సనల్ గా ధన్యవాదాలు చెప్పారు. పొద్దటి నుండి ఫోన్ లు వస్తున్నాయని… ప్రజాస్వామ్య పాలన సాగించడానికి నాకో అవకాశం వచ్చిందని వెల్లడించారు.

 

Kodandaram comments on mlc post

నా దృష్టిలో ఇది పవర్ కాదు సేవా అన్నారు కోదండరాం. అమరవీరులు వారి కుటుంబాల త్యాగమేనని… అందరి ఆకాంక్ష మేరకు పనిచేస్తానని వెల్లడించారు కోదండరాం. హామీ ఇస్తున్నా … ప్రతిజ్ఞ ముగిసింది కానీ పని చేయాల్సి వుందని తెలిపారు. తెలంగాణ అమరుల ఫలితమే నా పదవీ అని తెలిపారు. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళ్లు అర్పిస్తామని ప్రకటించారు కోదండరాం. కాగా,  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ లు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారితో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇవాళ ఉదయం ప్రమాణం చేయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version