కూటమి ప్రభుత్వంలో స్టాటైన కుమ్ములాటలు.. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే..

-

తామంతా ఒక్కటే.. అందరం కలిసి రాష్టాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తాం.. మనస్పర్దలు లేకుండా ఐక్యంగా ఉంటామంటూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు.. బిజేపీ నేతలు కూడా పదేపదే చెబుతూ వస్తున్నారు.. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడంలేదు.. కోస్తా ఆంద్ర, ఉత్తరాంద్రలో తామంతా ఒక్కటేనంటూ కలరింగ్ ఇస్తున్నా.. రాయలసీమలో మాత్రం కుమ్ములాటాలు స్టాటయ్యాయి. ఆదోనిలో బిజేపీ ఎమ్మెల్యే పార్దసారధి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది..

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. అందరూ సమిష్టిగా పనిచేసి. వైసీపీకి 11 స్థానాలకే పరిమితం చేశారు.. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. జనసేన, బిజేపీ నేతలకు సైతం మంత్రి పదవులు వరించాయి. .ఇంత వరకూ బాగానే ఉన్నా.. బిజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కొన్ని జిల్లాలో పరిస్థితి తయారైందనే ప్రచారం జరుగుతోంది.. ఆ ప్రచారాన్ని ఆదోని ఎమ్మెల్యే పార్దసారధి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు విభేదాలు నిజం చేశాయి.. రాజకీయ అనుభవం లేని పార్దసారధి కూటమి నియమాలను పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి..

ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.. ఈ వ్యాఖ్యల వెనుక బలమైన కారణాలే ఉన్నాయని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.. ఎమ్మెల్యేగా పార్దసారధి గెలిచినప్పటి నుంచి మీనాక్షి నాయుడ్ని పట్టించుకోవడం లేదట.. ఆయన అనుచరుల్ని సైతం పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది.. ఇలాగే ఉంటే తన అస్థిత్వానికి గండి పడుతుందని భావించిన మీనాక్షి నాయుడు.. నోరు విప్పారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.. దీనిపై ఎమ్మెల్యే కూడా స్పందించారు.. టీడీపీలో ఐదు గ్రూప్ లున్నాయని బాంబ్ పేల్చారు.. అందరినీ సమన్యాయం ఇస్తున్నట్లు ఆయన ప్రకటించినా.. ఈ అసంతృప్తి జ్వాలలు మాత్రం చల్లారడం లేదు.. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version