ఛాలెంజ్ అంటే ఇదీ…మీకంత ద‌మ్ముందా?

-

దేశం కాలుష్య మ‌యం. అందుకే ప్ర‌కృతి వైప‌రిత్యాలు క‌బ‌ళిస్తున్నాయి. 2030 నాటికి కాలుష్య కార‌కాల‌ను త‌గ్గించ‌క‌పోతే భార‌త‌దేశం మ్యాప్ లో లేకుండా పోవ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు హెచ్చ‌రించారు. అందుకే మేజ‌ర్ సిటీస్ ల‌లో ప్ర‌భుత్వం పెట్రోల్, డీజీల్ బ‌స్సుల‌ను త‌గ్గించి ఎల‌క్ర్టిక్ బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. చెత్త‌ను వేరు చేయ‌డానికి ఇంటింటికి రెండు బ‌కెట్ల‌ను కూడా ప్ర‌భుత్వం ఉచితంగా ఇచ్చింది. అయినా వాటిని వేరే ప‌నుల‌కు వాడుతున్నాం. కాలుష్య కార‌కాల కార‌ణంగా భూగ‌ర్బ జ‌లాలు అడుగింటి పోతున్నాయి. ఇప్ప‌టికే చాలా ప‌ట్ట‌ణాలు స‌హా ప‌ల్లె గ్రామాల్లో నీటి కోర‌త ఉంది.

nag ashwin one bucket challenge

చెన్నై న‌గ‌రం ఇప్పుడీ ఆ విష‌యంలో దుర్భ‌ర ప‌రిస్థితిని ఎదుర్కుంటోంది. క్రూడ్ ఆయిల్ స‌ర‌ఫ‌రా చేసే ట్యాకుల ద్వారా చెన్నైకి నీరు స‌ర‌ఫ‌రా చేయాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ప్ర‌జ‌లు నీళ్ల కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు హైద‌రాబాద్ దాదాపు ఆప‌రిస్థితికి ద‌గ్గ‌ర‌గా ఉంది. వేస‌విలో నీరు త‌గినంత అందుబాటులో లేక‌పోవ‌డంతో కిట‌కిట‌లాడుతోంది. ప్ర‌స్తుతం చోటు చేసుకుంటోన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో హైద‌రాబాద్ కి చెన్నై గతి త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. దీనిపై ద‌ర్శ‌కుడు మారుతి మంత్రి కేటీఆర్ ను సైతం ప్ర‌శ్నించాడు.

తాజాగా నీటి స‌మ‌స్య‌పై అవేర్ నెస్ తీసుకొచ్చే కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సంక‌ల్పించాడు. దీనిలో భాగంగా ఓ స‌వాల్ విసిరాడు. వ‌చ్చే ఆదివారం ఒక మ‌నిషి కేవ‌లం ఒక బ‌కెట్ నీరు మాత్ర‌మే వాడాల‌ని అంద‌రికీ స‌వాల్ విసిరాడు. ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర నుంచి టాయిలెట్, బ్ర‌ష్ చేయ‌డానికి, స్నానం చేయ‌డానికి, మ‌ల విస‌ర్జ‌న అన్నింటికి క‌లిపి ఒకే ఒక్క బ‌కెట్ నీరు వాడాల‌ని పిలుపునిచ్చాడు. మీలో అంత ద‌మ్ముందా? అయితే చేసి చూపించ‌డ‌ని స‌వాల్ విసిరాడు.

మ‌రి సామాజిక దృక్ఫ‌థంతో చేసిన ఈ స‌వాల్ ను ఎంత మంది స్వీక‌రిస్తారో చూద్దాం. ఎంత మంది అమ‌లు చేస్తారో కూడా చూద్దాం. రైస్ బ‌కెట్ చాలెంజ్, ఐస్ బ‌కెట్ ఛాలెంజ్ చేసిన వాళ్లంతా క‌చ్చితంగా ఒక్క బ‌కెట్ ఛాలెంజ్ ని స్వీక‌రించాలి. సినిమాల ద్వారా సందేశాలిచ్చే హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఈ ఛాలెంజ్ ని త‌ప్ప‌క స్వీక‌రించాలి సుమీ. లేదంటే ట్రోలింగ్ త‌ప్ప‌దు గుర్తు పెట్టుకోండ‌ని నేటి జ‌నులు ముందే హెచ్చ‌రించారు. చూద్దాం దీని క‌థ ఏందో సోమ‌వారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version