మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్య సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నారు. నా ఛానెల్ నా ఇష్టం అంటూ ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద తన గొంతు విప్పుతూ, ఎక్కువగా విమర్శలపాలవుతున్న నాగబాబు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి ప్రస్థావన తెచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఎంతమంది వచ్చినా హీరోయిన్ గా నిహారిక ట్రెండ్ సృష్టించింది. ఇక ఆమె యాక్టర్ గా మారుతా అని చెప్పినప్పుడే ముందు షాక్ అయినా ఆ తర్వాత పర్మిషన్ ఇచ్చానని.. అయితే ఏది చేసినా 3 ఏళ్ల వరకే అని 2018 వరకు ఛాన్స్ ఇచ్చానని ఆ తర్వాత పెళ్లే అని చెప్పారు నాగబాబు.
ప్రస్తుతం నిహారికకు అబ్బాయిని వెతికే పనిలో ఉన్నామని, తమ కులంలో మంచి అబ్బాయి దొరికితే హ్యాపీ లేదంటే మంచి వ్యక్తి, తన కాళ్ల మీద తను నిలబడగలిగే సత్తా ఉన్న వాడు ఏ కులం వాడైనా సరే తమకు నచ్చితే నిహారికను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు నాగబాబు. మొత్తానికి ఈ ఇయర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్ డిసైడ్ అయినట్టే అన్నమాట.