టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్గా నటించిన చిత్రం కస్టడీ మూవీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు మే 12వ తారీఖున వచ్చింది. ఈ చిత్రం యొక్క ప్రమోషన్ల గురించి పలు ఈవెంట్లు పాల్గొన్న నాగచైతన్య తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలలో కథానాయికల గురించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
సమంత.. నాగచైతన్య తన కెరియర్లో తన మాజీ భార్య సమంతతో ఎక్కువ చిత్రాల్లో నటించాడు. ఆమె గురించి నాగచైతన్యను అడగగా అతను చాలా పాజిటివ్గా సమాధానం చెప్పాడు. సమంత చాలా హార్డ్ వర్కర్ అని.. తాను ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ పనిని కచ్చితంగా సాధించి తీరుతుందని.. తను నటించిన వంటి ఓ బేబీ, యశోద సినిమాలు చూసానని అవి ఎంతగానో తనకు నచ్చాయని.. అతను తెలిపాడు..
అనంతరం ఆయన సమంత నుంచి విడిపోయిన విషయంపై స్పందిస్తూ.. ‘మా మధ్య ఏదైతే జరిగిందో నిజంగా ఆ సంఘటనలు దురదృష్టకరం. మేము విడిపోయినప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయి. కొంతమంది గాసిప్స్ క్రియేట్ చేస్తూ వార్తలు రాశారు. వాటిని చూసి చాలా ఇబ్బందిపడ్డా. మా గురించి ఎందుకు ఇంతలా వార్తలు సృష్టిస్తున్నారో అర్ధం కాలేదు. కొంత మంది ఛానెళ్ల టీఆర్పీ కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా అవసరం లేదు కదా అనిపించింది. రోజులు గడిచే కొద్ది వాటిని పట్టించుకోవడం మానేశా. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చింది వృత్తిపరమైన జీవితంతో ప్రేక్షకులను అలరించడానికి.. వ్యక్తిగత జీవితంతో ఎంటర్‌టైన్ చేయడానికి కాదు. అలా, నా వృత్తిపై మరింత దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న..” అంటూ తెలిపారు..