సెట్‌లో బాలయ్య అసహనం.. ఇక దబిది దిబిడే

-

నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. అభిమానులంతా ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు. తెరపై ఎంత విజృంభిస్తాడో.. వేదిక ఎక్కితే అంత తటపటాయిస్తాడు. బాలయ్య స్పీచ్‌లకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మైకు అందుకుంటే ఎటు నుంచి మొదలు పెట్టి ఎటు వైపుకు తీసుకెళ్తాడో ఆయనకే తెలియదు. సరేలే ఇదంతా కాసేపు సైడ్ చేద్దాం. ఆయన సినిమాల సంగతి ఓ సారి చూద్దాం.

వరుసగా ఫ్లాపులు, నిర్మాతగానూ ఫెయిల్యూర్ ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు బాలయ్య. నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ నిండా ముంచేసింది. హీరోగా చేసిన రూలర్ సినిమా నవ్వులపాలైంది. ఇక బాలయ్య సినిమాలకు గుడ్ బై చెబితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని కలిగించింది రూలర్. ఈ సినిమాలో ఆయన ధరించిన విగ్గులపై ఎన్నో ట్రోల్స్ జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఆయన ప్రస్తుతం బోయపాటి శీను కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటు బోయపాటికి, అటు బాలయ్యకు అది జీవన్మరణ సమస్యే. ఇద్దరూ డిజాస్టర్లతోనూ బాధపడుతున్నారు. వినయ విధేయ రామ వంటి అతి పెద్ద డిజాస్టర్ ఇచ్చిన బోయపాటి.. బాలయ్య సినిమాలోనూ ఏ మాత్రం వెనుకాడటం లేదంటా. బడ్జెట్‌కు పరిమితులు లేకుండా పోతున్నాయట. బాలయ్య వ్యక్తిగత విషయంలోనూ బోయపాటి మొండి పట్టు పడుతున్నాడు.

బాలయ్య తన మేకప్ విషయంలో ఎవ్వరి మాట వినడు. తనకోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ఉంటుందట. అయితే ఈ సారి మాత్రం అలా కుదరదని బాలయ్య మాటను పెడచెవిన పెట్టాడట బోయపాటి. దీంతో సెట్‌లో కొంచెం అసహనంగా ఉంటున్నాడట. అందరి మీదా అరుస్తున్నాడట. అందరూ జాగ్రత్తగా ఉండాలని, చిన్న తప్పు దొరికినా ఇక దబిడి దిబిడే అవుతుందని అంతా భయంతో వణికిపోతున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news