నందమూరి కుటుంబంలో పెళ్లి సందడి.. ఒకే ఫ్రేములో జూ.ఎన్టీఆర్, మోక్షజ్ఞ..

-

నందమూరి కుటుంబం పెళ్లి సందడి నెలకొంది.  మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కొడుకు వెంకట శ్రీ హర్ష పెళ్లి నిన్న జరిగింది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి వేదికగా ఈ వివాహం జరిగింది. ఇక సుహాసిని కొడుకు పెళ్లికి నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు అలాగే టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్, అటు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ, నందమూరి కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఓ ఫోటో దిగారు. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news