నాని `గ్యాంగ్ లీడ‌ర్` క‌థ లీక్‌.. స్టోరీ ఇదే..!

-

విక్రమ్‌ కె.కుమార్ ద‌ర్శ‌కత్వంలో నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న‌ చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘జెర్సీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్‌ స్టార్‌ నాని ప్ర‌స్తుతం విభిన్నమైన కథని ఎంచుకున్నాడు. అలాగే ఈ నెల 28న ట్రైలర్‌ని విడుదల చేయ‌బోతున్నారు.

nani gang leader movie story leaked
nani gang leader movie story leaked

నాని `గ్యాంగ్ లీడ‌ర్‌` సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని పాట‌లు ఇప్ప‌టికే విడుద‌ల అవుతున్నాయి. అయిటే ట్రైల‌ర్ విడుద‌ల కాక‌ముందే `గ్యాంగ్ లీడ‌ర్‌` స్టోరీ లీక్ అయింది. ఇదే క‌థ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో షికార్లు కొడుతోంది. మ‌రి క‌థ‌లోకి వెళ్తే.. ఈ సినిమాలో నాని ఓ నవలా రచయత. హాలీవుడ్‌ సినిమాల డివిడిలు చూసి కాపీ కథలతో పుస్తకాలు రాస్తుంటాడు. నానికి రివేంజ్ క‌థ‌లంటే పిచ్చి ఇష్టం.

అయితే రివేంజ్ క‌థ‌లే రెగ్యుల‌ర్‌గా రాస్తుండ‌డంతో.. అవి బాగా హిట్ అవుతాయి. దీంతో నాని పాపుల‌ర్ అయిపోతాడు. ఈ క్ర‌మంలోనే ప్రియా మోహన్ అత‌న్ని న‌మ్మి రివెంజ్‌ కోసం చూస్తోన్న అయిదుగురు ఆడాళ్లు ని తీసుకువ‌చ్చి హెల్ప్ చేయ‌మంటుంది. దీంతో భ‌య‌ప‌డుతూ త‌ప్ప‌క ఒప్పుకోవాల్సి వ‌స్తుంది.

నానికి అంత ధైర్యం లేక‌పోయినా వాళ్ల‌తో క‌లిసి విల‌న్ ఢీ కొట్టాల‌ని అనుకుంటారు. వీరంద‌రికి విల‌న్ కార్తికేయ‌. అతనో బైక్ రేసర్ అని, బ్యాంక్ ని ముంచేసాడని, ఆ బ్యాంక్ లోనే వాళ్లందరి డబ్బులు ఉన్నాయని తెలుస్తుంది. చివ‌ర‌కు నాని గ్యాంగ్ లీడ‌ర్‌గా వాళ్ల‌కు హెల్ప్ చేయ‌డ‌మే క‌థ‌. సినిమా లైన్ ఇంట్ర‌స్టింగ్‌గానే ఉంది. మ‌రి గ్యాంగ్‌లీడ‌ర్ ఏం చేస్తాడో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news