ప్రముఖ నటుడు నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నారా రోహిత్ తాజాగా తన పెళ్లి డేట్ అనౌన్స్ చేశారు. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో తన వివాహం జరగనుందని రోహిత్ స్పష్టం చేశారు. నారా రోహిత్ శిరీష ప్రతినిధి-2 సినిమాలో కలిసి నటించారు.

ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు వారి కుటుంబ సభ్యులను ఒప్పించి గత సంవత్సరంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. పెళ్లి పనులు ప్రారంభించాలని అనుకునే సమయంలోనే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. ఆ తర్వాత వీరి వివాహానికి బ్రేక్ పడింది. ఇక అక్టోబర్ నెలలో నారా రోహిత్, శిరీష వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నారా రోహిత్, శిరీషకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.