ఎఫ్‌-3లో పిసినారి పాత్ర‌లో న‌ట‌కిరీటి.. ఆ సినిమాను ఇమిటేట్ చేస్తున్నాడా?

-

రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట విశ్వ‌రూపం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఏ సినిమా చేసినా.. త‌న న‌ట‌న‌ను హైలెట్ అయ్యేలా చూసుకుంటారు. పాత్ర‌లోకిప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి దాన్ని పండించ‌డం ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య. ఇప్పుడు మ‌రో మెస్మ‌రైజ్ క్యారెక్ట‌ర్ చేయ‌బోతున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ కాంబోలో వ‌చ్చిన ఎఫ్‌-2లో చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాలో వెంకటేష్, హీరో వరుణ్ తేజ్ లతో కలిసి రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎంత కామెడీని పంచారో అంద‌రికీ తెలిసిందే. అయితే దానికి సీక్వెల్ తెర‌కెక్కుతున్న ఎఫ్‌-3లో కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌ను చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పిసినారి పాత్రలో న‌వ్వించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న జంధ్యాల ఆహ‌నా పెళ్ళంట సినిమాలోని కోట పాత్రను ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమాలో కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్ పాత్ర‌ను అలాగే డిజైన్ చేస్తున్నాడంట అనిల్ రావిపూడి. ఈ పాత్ర స‌రికొత్త‌గా సినిమాకు హైలెట్‌గా మారుతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇప్పుడు క‌రోనాతో వాయిదా ప‌డ్డ షూటింగ్ సారధి స్టూడియోలో త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. ఈ సినిమా డబ్బులు చుట్టూ ముగ్గురు ప‌డే ఇబ్బందుల‌ను చూపించే కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోంది. ఎప్‌-2లో చేసిన వాళ్లే ఇందులోనూ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version