యంగ్ హీరో న‌వ‌దీప్ సాహ‌స యాత్ర‌‌!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల జీవితాల్లోనూ సామూల మార్పులు చోటు చేసుకున్నాయి. వైర‌స్ ఉదృతంగా వున్న స‌మ‌యంలో ఏ ఒక్క‌రూ ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్టేందుకు ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో చాలా మంది ఇంట్లో బోర్ ఫీల‌య్యారు. నిత్యం షూటింగ్‌ల‌తో వివిధ ప్రాంతాల‌న్నీ చుట్టి వ‌చ్చే సెల‌బ్రిటీలు క‌రోనా కార‌ణంగా ఇంటికే ప‌రిమ‌యిత‌మైపోయారు.

అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ఉధృతి కొంత మేర త‌గ్గ‌డంతో సెల‌బ్రిటీలు విహార యాత్ర‌ల‌కు వెళుతున్నారు. కానీ యంగ్ హీరో న‌వ‌దీప్ మాత్రం హిమాల‌యాల్లో సాహ‌స‌యాత్ర‌కు వెళ్ల‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ పాండ‌మిక్ టైమ్‌లో భ‌యం భ‌యంతో ఇంటి వ‌ద్దే గ‌డిపిన వారంతా రిలాక్స్ కోసం వెకేష‌న్‌కి వెళుతుంటే న‌వ‌దీప్ మాత్రం ఫ్రెండ్స్‌తో క‌లిసి హిమాల‌యాల‌కు రోడ్ ట్రిప్‌కి వెళ్లాడు.

ఈ ట్రిప్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వీడియోల‌ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్‌గా మారాయి. `క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ప్ర‌యాణించ‌డం సిర‌కొత్త అనుభ‌వం. ఇది నా జీవితాన్ని మార్చే అనుభ‌వంగా భావిస్తున్నాను. మేము మైన‌స్ ఐదు డిగ్రీల కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లో ఉన్నాం. ఈ ప్ర‌యాణంలో మూడు సార్లు కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల్సి వ‌చ్చింది` అని న‌వ‌దీప్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేశాడు.

https://www.instagram.com/tv/CGXnGGtJKt-/?utm_source=ig_web_copy_link