ధనుష్‌పై నయనతార లెటర్.. విస్తుపోయే విషయాలు వెల్లడి..!

-

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం నయనతార్ పోస్ట్ చేసిన ఓ ఓపెన్ లెటర్ పెద్ద దుమారం రేపుతోంది. స్టార్ హీరో ధనుష్‌పై నయనతార పలు ఆరోపణలు చేస్తూ ఈ లెటర్‌ను తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల నయనతార జీవితంపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నయనతార ఒక స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగింది అనే విషయాలను ప్రేక్షకులకు చూపెట్టారు.

ఈ డాక్యుమెంటరీలో ఆమె నటించిన సినిమాలకు సంబంధించిన సీన్లు, మేకింగ్ సీన్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య వచ్చినట్లు నయనతార తన లెటర్‌లో పేర్కొంది. ‘నానుమ్ రౌడీ ధాన్’ అనే సినిమాను ధనుష్ ప్రొడ్యూస్ చేయగా విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతార లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా విషయంలో నయనతార, ధనుష్‌ల మధ్య మనస్పర్థలు వచ్చాయి.  ధనుష్ వారిని కొంతకాలం వెయిట్ కూడా చేయించాడు. ఎట్టకేలకు వారి ధనుష్ నుండి NOC రాకపోవడంతో తమ డాక్యుమెంటరీలో ఆ సినిమా సీన్స్ కట్ చేసి దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇందులోని 3 సెకన్ల మేకింగ్ సీన్ కనిపించడంతో ధనుష్, ఈ డాక్యుమెంటరీ మేకర్స్ నుండి రూ.10 కోట్లు నష్టపరిహారంగా డిమాండ్ చేస్తున్నాడు. దీంతో నయన్ తార లేఖ రాసింది.

Read more RELATED
Recommended to you

Latest news