తన ఫిట్నెస్ సీక్రెట్ మంత్ర అదే అంటున్న నయనతార..!

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో పుట్టి అహర్నిశలు కష్టపడి నటిగా మారి అవమానాలు, విమర్శలు ఎదుర్కొని కథానాయిక గారి ఇప్పుడు క్రేజీ ఇండియన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు డిమాండ్లకు భయపడిన ఈమె నేడు డిమాండ్ చేసే స్థాయికి ఎరిగింది అంటే ఇక ఆమె ఎంతలా కష్టపడి పైకి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ప్రతి ఒక్కరికి వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు.. అందంలో తగ్గుదల ఇలా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ నయనతార వయసు నాలుగు పదులకు దగ్గరవుతున్నా సరే ఆమె ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా సాగుతోంది. పెళ్లి చేసుకొని సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార ఇప్పటికీ కూడా హీరోయిన్గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంత లేట్ వయసులో కూడా నయనతార ఇంత ఫిట్ గా, స్లిమ్ గా ఉండడానికి కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.

ఇకపోతే నయనతార బరువు తగ్గడానికి ఫిట్నెస్ మైంటైన్ చేయడానికి కారణం ఆమె చేసే జిమ్ వర్కౌట్ , యోగాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది. ముఖ్యంగా నయనతార ఫిట్నెస్ కి యోగా బాగా ఉపకరించింది అని.. అందుకే ఆమె ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ ను మైంటైన్ చేస్తోందని సమాచారం. ఇకపోతే డైట్ ప్లానింగ్ లో కచ్చితంగా కొబ్బరి నీళ్ళు తప్పకుండా ఉండాల్సిందేనట. రోజూ రెండు గంటలు యోగా చేస్తుందట. అల్పాహారంలో పళ్ళ రసం తప్పనిసరి.. మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్ , గుడ్డు , కూరగాయలు సమపాళ్లల్లో తీసుకుంటారట. ఇక ఎంత పని ఉన్నా రాత్రి 8 గంటలకే నిద్రపోవడం లాంటి అలవాటును నేర్చుకున్నారట నయనతార.

Read more RELATED
Recommended to you

Latest news