ఈ నెల 11న తెలంగాణలో సాహిత్య దినోత్సవాలు

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాలు నిర్వహించనున్నట్లు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ప్రకటన చేశారు. ముక్కుపుడి జిల్లాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కవి సమ్మేళనాలు జరుగుతాయని పేర్కొన్నారు. వీటిలో ఉత్తమ పద్యాలు మరియు కవితలను ఎంపిక చేసి రా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీకి పంపిస్తామని చెప్పారు.

విభాగాల వారీగా నగదు బహుమతులను కూడా అందజేస్తామని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హరితోత్సవం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హరితహారం 9వ విడత కార్యక్రమాన్ని అదే రోజున ప్రారంభించనున్నట్లు ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ హరితోత్సవం వాల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news