ఓటీటీలోకి ‘నేను స్టూడెంట్‌ సర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తకాదు. ఆ వారసుల సోదరుల ఎంట్రీ కొత్తేం కాదు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో బెల్లంకొండ గణేశ్. బెల్లంకొండ సురేశ్ తనయుడిగా.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సోదరుడిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. ‘స్వాతిముత్యం’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా మెప్పించాడు.

అలా అందరి దారిలో వెళ్లకుండా డిఫరెంట్ కంటెంట్ ను ఎంచుకుంటున్నాడు గణేశ్. తన సెకండ్ మూవీ ‘నేను స్టూడెంట్‌ సర్‌’తో ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తున్నాడు. ఈ సినిమా ఓటీటీ  విడుదల తేదీ తాజాగా ఖరారైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’  జులై 14 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వివరాలు తెలియజేస్తూ ‘స్టూడెంట్‌ వచ్చేస్తున్నాడు..! థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌కి సిద్ధమవ్వండి’ అని సదరు సంస్థ పేర్కొంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా కొత్త పోస్టర్‌ని పంచుకుంది. రాకేశ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో జూన్‌ 2న విడుదలైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version