అలాంటి వారిని విమర్శించడానికి అస్సలు వెనకాడొద్దు.. షాంఘై సదస్సులో మోదీ

-

ఉగ్రవాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడానికి షాంఘై సహకార సంస్థ- ఎస్​సీఓ దేశాలు ఏ మాత్రం వెనకాడకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ వైఖరి ఉండకూడదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించడానికి ఏ మాత్రం వెనకాడొద్దని.. పరోక్షంగా పాకిస్థాన్ ను ఉద్దేశించి ప్రసంగించారు.

“ఆఫ్గనిస్థాన్‌లోని పరిస్థితి ఎస్​సీఓ దేశాల భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. ఆఫ్గనిస్తాన్‌కు సంబంధించి భారతదేశం ఆందోళనలు, అంచనాలు చాలా ఎస్​సీఓ సభ్య దేశాల మాదిరిగానే ఉన్నాయి.  పొరుగు దేశాలలో అశాంతిని వ్యాప్తి చేయడానికి లేదా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించడానికి ఆఫ్గనిస్థాన్‌ను ఎవరూ ఉపయోగించకుండా చూడాలి.”
– నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

వర్చువల్ విధానంలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు- ఎస్​సీఓ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు వింటుండగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version