నెట్‌ఫ్లిక్స్ యూజ‌ర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా త‌గ్గిన స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర‌లు

స‌బ్ స్క్రిప్ష‌న్ కు అత్య‌ధిక ధ‌ర‌లు క‌లిగిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌లో నెట్ ఫ్లిక్స్ ముందు వరుస లో ఉంటుంది. ఆ ధ‌ర‌ల ను చూసి చాలా మంది నెట్ ఫ్లిక్స్ అంటేనే భ‌య‌ప‌డుతారు. తాజా గా నెట్ ఫ్లిక్స్ త‌న వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. నెట్ ఫ్లిక్స్ త‌న స‌బ్ స్క్రిప్ష‌న్ ధ‌ర‌ల‌ను దాదాపు 60 శాతం మేర త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీంతో సామాన్యుల‌కు అందుబాటు లో ఉండే విధం గా కొత్త ధ‌ర‌లు అందు బాటు లోకి వ‌చ్చాయి.

కొత్త ధ‌ర‌ల ప్ర‌కారం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 199 ఉన్న మొబైల్ వెర్ష‌న్ ధ‌ర ఇప్పుడు రూ. 149 కే వ‌స్తుంది. అలాగే రూ.499 తో ఉన్న‌ బేసిక్ ప్లాన్ ను ఏకం గా రూ. 199 కి త‌గ్గించి అందుబాటు లోకి తెచ్చింది. అలాగే రూ. 649 తో ఉన్న స్టాండ‌ర్డ్ ప్లాన్ ను రూ. 499 కే అందిస్తుంది.

దీని తో పాటు రూ. 799 తో ఉన్న ప్రీమియం ప్లాన్ ను రూ. 649 కు త‌గ్గించింది. కాగ ఈ కొత్త కేవ‌లం భార‌త్ వ‌ర‌కే ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. దీంతో నెట్ ఫ్లిక్స్ భార‌త్ పై ఫోక‌స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. కాగ అమెజాన్ ప్రైమ్ ఇటీవ‌ల త‌న స‌బ్ స్క్రిప్ష‌న్ ధ‌ర‌ల‌ను దాదాపు 50 శాతానికి పెంచింది. దీంతో నెట్ ఫ్లెక్స్ తీసుకున్న ఈ నిర్ణ‌యం తో భారీ గా స‌బ్ స్క్రిప్ష‌న్ పెరిగే అవ‌కాశం ఉంది.