పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తో సహా మరికొందరికి సంతాపం తెలపనుంది పార్లమెంట్. రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను ప్రవేశ పెట్టనున్నారు. రెండు విడతలుగా ఈ సమావేశాలు జరుగుతాయి. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగగా.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి.
- నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తో సహా మరికొందరికి సంతాపం తెలపనున్న పార్లమెంట్
- రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్