రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలి : ఎంపీ ఈటల

-

తెలంగాణలో మూడో వంతు జనాభాను జీహెచ్ఎంసీ పాలిస్తుందని.. రాజకీయాలకు అతీతంగా ప్రజల బాధ్యతను తీసుకోవాలన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. ఈ తరుణంలోనే తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. సంకుచితత్వానికి పోకుండా అవసరమైన చోట నిధులు ఇవ్వాలన్నారు. నగరంలోని కనీస సౌకర్యాలకు నోచుకొని ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. 

బడ్జెట్ ఎంత ఖర్చులు రాబడి అనేది పక్కన పెట్టి సమస్యలపై దృష్టి పెట్టుకపోతే నగరం మసకబారుతుందని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ బాధ ఏంటో నాకు తెలుసు అని, పాత కాంట్రాక్టర్లకే బిల్లులు రాకపోతే కొత్త కాంట్రాక్టర్లు ఎలా వస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కంటే కార్పొరేటర్లకు రీచ్ ఎక్కువగా ఉంటుందని.. పేదల్లో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదని.. ఉస్మానియా హాస్పిటల్ ఉన్న చోటనే గొప్ప హాస్పిటల్ గా కట్టొచ్చన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news