పోలీసుల‌కు షాక్.. హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ విష‌యంలో కొత్త మ‌లుపు..

-

హీరో రాజశేఖర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దయింది. రవాణాశాఖ ఆయన డ్రైవింగ్‌ లైసెన్స్‌ను 6 నెలలపాటు రద్దు చేసింది. గతనెల 12న ఔటర్‌ రింగ్‌ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఆ సమయంలో రాజశేఖరేకారు నడిపారు. దీంతో వారు ఈ ఏడాది నవంబరు 29 నుంచి వచ్చే ఏడాది మే 20 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అంత వరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాత తెలిసిన విషయం పోలీసులను విస్తుపోయేలా చేసింది. నిజానికి రాజశేఖర్ డ్రైవింగ్ లెసెన్స్ అసలు మనుగడలోనే లేదని తేలింది. దీంతో షాకైన పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న నటుడిపై మరో కేసు నమోదు చేయాలని తాజాగా నిర్ణయించారు.

రాజశేఖర్ వాహనంపై ఏడాదిలో 21 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్టు తేలింది. వీటిలో 19 పరిమితికి మించిన వేగానికి సంబంధించినవే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన లైసెన్స్ సస్పెన్షన్‌లో ఉండడంతో ఇప్పటికిప్పుడు పునరుద్ధరించుకోవడం సాధ్యం కాదని, మే 28 తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని సమాచారం. లైసెన్స్ లేకుండా అప్పటి వరకు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version