Chiranjeevi: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్‌కు అన్ని కోట్ల..?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’. మాలీవుడ్(మలయాళ) సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుండగా, సత్యదేవ్ , సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇందులో సల్మాన్ ఖాన్, చిరంజీవిలకు ఓ సెపరేట్ సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్ష్ మెంట్ ఇచ్చారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా సగం కంటే ఎక్కువ శాతం పూర్తయినట్లు తెలుస్తోంది.

చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఆచార్య’ తర్వాత విడుదల కాబోయే చిత్రం ‘గాడ్ ఫాదర్’ అని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ పిక్చర్ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

ఈ సినిమాను బాలీవుడ్ లోనూ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా రూ.45 కోట్ల డీల్ సెట్ అయిందని సమచారం. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తుండటం వలన సినిమాకు ఇంకా క్రేజ్ పెరిగింది. ఆగస్ట్‌లో కాని సెప్టెంబర్ లో కాని పిక్చర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version