ఇస్మార్ట్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ఏకంగా పాన్ ఇండియా స్టార్​ సినిమాలో ఛాన్స్

-

బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్​ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఫామ్​లోకి వస్తోంది. ఈ భామకు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా యూత్​లో సూపర్ క్రేజ్ ఉంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో యువతలో పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక ఆ పాపులారిటీతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ సరసన ఈ భామ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్టు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఓ పాన్ ఇండియన్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట నిధి. మరి ఆ స్టార్ ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్​. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న సినిమాలో నిధిని ఓకే చేశారట. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్‌’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ బ్యూటీ షూటింగ్​లో పాల్గొనబోతోందట.

Read more RELATED
Recommended to you

Latest news