తెలుగు హీరోతో నిధి డేటింగ్‌లో వుందా?

-

లాక్‌డౌన్ పిరియ‌డ్ చాలా మందిని జంట‌లుగా చేసింది. కొంత మందిని ప్రేమ‌లో ప‌డేసింది. ఇటీవ‌ల టాలీవుడ్‌లో వ‌రుస పెళ్లిళ్లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. యంగ్ హీరోలు చాలా మంది లాక్‌డౌన్ స‌మ‌యంలోనే వెడ్డింగ్ బెల్స్ మోగించారు. క్రేజీ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కూడా రొమాంటిక్ రిలేష‌న్ కి రెడీ అయిందంట‌. ఓ తెలుగు హీరోతో నిధి అగ‌ర్వాల్ డేటింగ్‌లో వుందంటూ ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వార్త‌ల‌పై తాజాగా నిధి అగ‌ర్వాల్ స్పందించింది. త‌ను ఎలాంటి రొమాంటిక్ రిలేష‌న్‌కి ఎడిక్ట్ కాలేద‌ని, ముఖ్యంగా ఏ హీరోతోనూ త‌ను డేటింగ్‌లో లేన‌ని స్ప‌ష్టం చేసింది. అవ‌న్నీ గాలి వార్త‌ల‌ని కొట్టిపారేసింది. `మున్నా మైఖేల్` మూవీతో న‌టిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగ‌ర్వాల్. ఆ త‌రువాత ఆమె క‌న్ను టాలీవుడ్ ప‌డిన విష‌యం తెలిసిందే.

నాగ‌చైత‌న్య‌తో క‌లిసి `స‌వ్య‌సాచి`, అఖిల్ అక్కినేనితో క‌లిసి `మిస్ట‌ర్ మ‌జ్ను`వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోలేక‌పోయింది. లాస్ట్ ఇయ‌ర్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకుని క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. ప్ర‌స్తుతం మాస్ మహారాజా ర‌వితేజ‌తో త్రినాథ‌రావు న‌క్కిన రూపొందిస్తున్న చిత్రంతో పాటు మ‌హేష్ మేన‌ల్లుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రంలోనూ న‌టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version