మెగా వారసురాలు నిహారిక గత రెండు సంవత్సరాల క్రితం గుంటూరు రిటైర్డ్ ఐజి ప్రభాకర్ కొడుకు చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతలోనే బ్రేకప్ చెప్పుకున్నారు. ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే అప్పటినుంచి మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు ఈ జంట. అసలు ఎందుకు వీరు విడిపోవాల్సి వచ్చింది అనే కోణంలో జనాలు కూడా ఆరాధిస్తూ హాట్ టాపిక్ గా మారుస్తున్నారు. ఇదిలా ఉండగా భర్తతో విడిపోయాక తన పర్సనల్ లైఫ్ తన ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తోంది నిహారిక.
అయితే ఇప్పుడు కెరియర్ పరంగా డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత సమంత లాగే తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టేసింది. పలు వెబ్ సిరీస్ లను చేస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ సక్సెస్ పొందే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మళ్ళీ హీరోయిన్ గా తెర పైకి రావాలని నిర్ణయించుకుందట నిహారిక. ఈ మేరకు యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని కానీ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ పై మెగా ఫ్యామిలీ ఇష్టం చూపించడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.
కాకపోతే ఈ విషయంలో నిహారిక మాత్రం చాలా స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె పెద్దగా సక్సెస్ కాలేదు. మళ్ళీ హీరోయిన్ గా అడుగుపెడితే సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి నిహారిక కాన్ఫిడెంట్ ఏ వరకు వర్క్ అవుట్ అవుతుందో.