టమాట భారత్లో మంట పెడుతోంది. రోజురోజుకు ఈ కూరగాయ ధరలు సామాన్యులకు గాయం చేస్తున్నాయి. గత నెలలో టమాట ధర 326.13 శాతం పెరిగినట్టు ప్రభుత్వ అంచనా. టమోటా ధరలు కొన్ని చోట్లు డబుల్ సెంచరీ కూడా దాటేశాయి. ఇక సామాన్యులు అయితే వాటిని కొనడమే మానేశారు. ఒకప్పుడు కేజీ 10-20కి వచ్చేవి ఇప్పుడు 100-500 పైనే ఉంటున్నాయి.
ఇక టమాటా ధరలు ఆకాశాన్ని అందడంతో సామాన్య ప్రజలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. మొన్నటిదాకా కిలో రూ. 150 ఉండగా… తాజాగా మెదక్ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ. 200కి చేరింది. భారీ వర్షాలతో సరఫరా తగ్గిపోవడంతో ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు పచ్చిమిర్చి కిలో రూ.130 కి చేరింది. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ. 80 నుంచి రూ. 100 ధర ఉన్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.