బన్నిని యాజిటీజ్ దించేశాడు..!

-

కన్నడ హీరో నిఖిల్ చేస్తున్న సీతారామ కళ్యాణ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీజర్ లో నిఖిల్ యాక్షన్ సీన్స్ అన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా ఫైట్ సీన్స్ కాపీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన బన్ని సరైనోడు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సినిమాలో మెయిన్ యాక్షన్ పార్ట్ బాగుండటం మెగా ఫ్యాన్స్ ఈ సినిమా సూపర్ హిట్ చేశారు.

అయితే సీతారామ కళ్యాణ సినిమా బన్ని సరైనోడుకి రీమేకా అంటే కాదని తెలుస్తుంది. మరి సినిమా రీమేక్ కాకున్నా యాక్షన్ సీన్స్ మాత్రం డిటో బన్నిని యాజిటీజ్ దించేశాడు నిఖిల్. అక్కడ ఈ యాక్షన్ సీన్స్ కు ఫ్యాన్స్ ఏర్పడొచ్చేమో కాని నిఖిల్ టీజర్ చూసి తెలుగు ఆడియెన్స్ మాత్రం కాపీ క్యాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కుమారస్వామి నిర్మించిన ఈ సినిమాను హర్ష డైరెక్ట్ చేశాడు. రచితా రామ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించడం విశేషం. మరి టీజర్ లోనే ఇంత కాపీ ఉంటే సినిమాలో ఇంకెంత కాపీ కంటెంట్ ఉంటుందో అని డౌట్ పడుతున్నారు. అది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version