తెరపైకి నీరవ్ మోడీ స్కామ్.. దర్శకుడు ఎవరంటే?

-

ఆర్థిక నేరగాడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ జీవితాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ స్కామ్ ను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. దీన్ని బాలీవుడ్‌ దర్శకుడు పలాష్ వాస్వానీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌గా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనాలు వచ్చాయి.

నీరవ్‌ మోడీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని పవన్ సి.లాల్‌ రచించిన పుస్తకం ‘ఫ్లాడ్: ది రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ ఇండియాస్‌ డైమండ్‌ మొఘల్‌ నీరవ్‌ మోడీ’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలిసింది. ఈ పుస్తకంలో నీరవ్‌ జీవితం ఎలా మొదలైంది. అతడు చేసిన స్కామ్‌ గురించి పవన్ ప్రస్తావించారు. దేశంలోని బ్యాంకింగ్‌ రంగంలో జరిగిన భారీ స్కామ్స్‌లో ఒకటిగా భావించే దీని గురించి ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే సినిమా తీయనున్నట్లు సమాచారం.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు రూ.13వేల కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తిన అనంతరం తన మామ మెహుల్‌ ఛోక్సీతో కలిసి నీరవ్‌ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news