ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు అంటే వారు రాసినటువంటి పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 23న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. అయితే