నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమా థియేటర్లలో శుక్రవారం రోజున విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజులలో కేవలం మూడు కోట్ల షేర్ కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్లుగా సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. రూ. 75 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ. 25 కోట్లకు అమ్ముడు పోగా 12 శాతం మాత్రమే రికవరీ అయినట్లుగా సినీ విశ్లేషకులు వెల్లడించారు.

తమ్ముడు సినిమా దారుణమైన డిజాస్టర్ చవి చూసిందని పేర్కొన్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా…. వర్ష బోల్లమ్మ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటి లయ కీలకపాత్రను పోషించిన విషయం తెలిసిందే. ఇదివరకు హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా కూడా ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది.