జగన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి మామిడి రైతుల ఖాతాలలో డబ్బులు

-

రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ కానున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మామిడి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 250 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కిలోపు అదనంగా నాలుగు రూపాయలు మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోలు చేపట్టిందన్నారు.

ATCHANNAIDU
ATCHANNAIDU

ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతులకు ఖాతాలలో జమ చేస్తామన్నారు. జగన్ బంగారు పాళ్యం పర్యటనలో మామిడి కాయలు పారబోసిన ఘటనపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే జగన్ ఓ ప్రాంతానికి రాగానే 5 ట్రాక్టర్లను సిద్ధం చేశారని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఐదు ట్రాక్టర్లు వైసీపీకి చెందిన వారివే… జగన్ రాగానే రోడ్డుపై మామిడి కాయలను వైసీపీ కార్యకర్తలు పారబోశారన్నారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news