కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినందుకు కేసీఆర్‌ను వంద కొరడా దెబ్బలు కొట్టాలని షాకింగ్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాము… ఎందుకంటే క్లబ్బులు, పబ్బులు మాకు అలవాటు లేదని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
వరద జలాలు, నికర జలాలను రంగారెడ్డి, నల్గొండకు తీసుకెళ్తే ఏంటి అభ్యంతరం? అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల ఆ నీళ్లు మిగిలిపోయి వరదలా కనిపిస్తోంది… గత పదేళ్ల పాలనలో నిధులు ఖాళీ అయ్యాయి కానీ నీళ్లు మాత్రం రాలేదని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.