త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యామీనన్.. వరుడు ఎవరంటే..?

-

నిత్యామీనన్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు . తన నటనతో, అందంతో మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. అంతేకాదు ఇంకొక వైపు పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నిత్యామీనన్. ఇదిలా ఉండగా ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. అలాంటి వారిలో ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, అలియా భట్ కాగా కోలీవుడ్లో ఆది పినిశెట్టి, నయనతార ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తాము ప్రేమించిన వారితో జీవితం పంచుకోవడానికి ఒక అడుగు ముందుకు తీసుకుని.. పెళ్లి చేసుకొని భార్యాభర్తలు గా మారిపోతున్నారు.

ఇక ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మరో హీరోయిన్ నిత్యమీనన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ మలయాళం బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. తన తన నాచురల్ యాక్టింగ్ చూస్తూ స్టార్ హీరోలు సైతం ఆమెకు అభిమానులుగా మారిపోయారు. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతో మంది హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. నిత్యమీనన్ పై ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ చెడుగా రాలేదు. ఇలా సడన్గా ఆమె పెళ్లి వార్త నెట్టింట ప్రత్యక్షమవడం అభిమానులకు షాకింగ్ గా ఉంది. ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకోబోయేది మలయాళ స్టార్ హీరోనే అని కూడా తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుండి కూడా తనతో ఫ్రెండ్షిప్ ఉండేదట. ఇక ఆ పరిచయం అలా స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మన తెలుగు హీరో వాళ్ళకి కూడా బాగా పరిచయమైన వాడే అంటూ ఒక క్రేజీ రూమర్ కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే నిత్యామీనన్ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోంది అనే విషయంపై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version