దేవర సినిమా రిలీజ్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కొరటాల శివను పొగుడుతూ.. ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది… మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. కొరటాల శివ గారూ, ఇంత ఆకర్షణీయమైన డ్రామా, భావోద్వేగ అనుభవంతో దేవరను అందించినందుకు ధన్యవాదాలు చెప్పారు.
నా సోదరుడు అనిరుధ్…అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ ప్రపంచానికి ప్రాణం పోసిందని కొనియాడారు. దేవర నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని గారికి సినిమాకు స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
రత్నవేలు సార్, సాబుసిరిల్ సర్, శ్రీకర్ ప్రసాద్ సర్ మరియు వారి అద్భుతమైన పనికి ప్రతి టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు చెప్పారు ఎన్టీఆర్. నా అభిమానులకు, దేవర కోసం మీరు జరుపుకునే వేడుకలను చూడటం నన్ను చాలా ఉప్పొంగేలా చేసిందని తెలిపారు. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను చేసినంతగా మీరు కూడా ఆనందిస్తున్నందుకు సంతోషం. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నానని వివరించారు.