వార్ 2 లేటెస్ట్ అప్డేట్.. ఆ పాత్రలో అదరగొట్టనున్న ఎన్టీఆర్

-

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్-2 సినిమాలో తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఫోకస్ అంతా ఉంది. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.

గతంలో సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ ఖాన్‌లు ఏజెంట్‌ పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే వారి పాత్రలను మించి ఎన్టీఆర్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. ‘‘ఒక మంచి కథతో హిందీ చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌ను పరిచయం చేసేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. వార్‌-2తో బాలీవుడ్‌లో ఆయన ప్రయాణం ఆగిపోదు. మరెన్నో చిత్రల్లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇది దీర్ఘకాలిక ఒప్పందం. పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమలో భాగం అవుతున్నారు. ఇది మొదటి బ్లూ-పాన్‌ ఇండియా సినిమా. అయితే మార్చి 7న జపాన్‌లో హృతిక్‌ రోషన్‌ పరిచయ సన్నివేశాలతో చిత్రీకరణ ప్రారంభం కానుంది’’ అని చిత్రబృందం సన్నిహిత వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news