అగ్నిసాక్షిగా ఆసియా కి తాళి కట్టేసిన నూకరాజు.. వీడియో వైరల్..!

-

పటాస్ షో ద్వారా తన టాలెంట్ నిరూపించుకోవడానికి అడుగుపెట్టిన నూకరాజు అక్కడే చిన్నపిల్లలతో అలాగే ఆసియా తో కలిసి కామెడీని పండించేవాడు ఆ తర్వాత ఒక గుర్తింపు సంపాదించుకున్న నూకరాజు జబర్దస్త్ లోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్క్రిప్ట్ రైటర్ గా, లేడీ గెటప్లో కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నూకరాజు అంటే ఎంతో మందికి అభిమానం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలామంది నూకరాజు స్కిట్లు చూడడానికి కూడా జబర్దస్త్ చూస్తున్నారు అనడంలో సందేహం లేదుకేవలం జబర్దస్త్ లో మాత్రమే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా నూకరాజు తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.

ముఖ్యంగా తాను కామెడీని పండించడమే కాదు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను కూడా స్క్రిప్టు రూపంలో చేసి అందరి చేత కంటతడి పెట్టిస్తూ ఉంటాడు అందుకే నూకరాజు బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఇది ఇలా ఉండగా తాజాగా నూకరాజు అలాగే ఆయన ప్రేయసి ఆసియాతో పాటు ప్రవీణ్ -ఫహిమా, పరదేశి – షబీనా, కార్తిక్ – భాను ఇలా వీరంతా వచ్చి క్యాష్ షో లో సుమాతో సందడి చేయడం జరిగింది ఇక వీరందరినీ కూడా సుమ పలు రకాల ప్రశ్నలు అడుగుతూనే ఈ ప్రేమికుల మధ్య ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఆమె బయటకు రాబట్టింది.

ఇక ఈ క్రమంలోని నూకరాజును ఉద్దేశించి ఆసియా పై నీకు నిజంగా ప్రేమ ఉంటే చేతిలో కర్పూరం వెలిగించుకో అని చెబుతుంది. ఇక తన చేతిలో కర్పూరాన్ని వెలిగించుకున్న నూకరాజు..నొప్పి ఉన్నా ..మండుతున్నా.. అక్కడున్న వారంతా వద్దని చెప్పినా కూడా ఆసియా పై తన ప్రేమను చూపించాడు నూకరాజు . ఆ తర్వాత సుమ తాళి చూపించి నీకు నిజమైన ప్రేమే ఉంటే తాళికట్టు అనగానే తాళికట్టబోతుంటే ప్రోమో కట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతుంది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు కేవలం టిఆర్పి రేటింగ్ కోసం మాత్రమే కాదు నిజంగానే వివాహం చేసుకోబోతున్నారు అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు ఆసియా నూకరాజు జంట చాలా బాగుంటుంది అని వారికి అప్పుడే పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం కూడా గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version