మహేష్ బాబు పరశురామ్ సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ..!

-

ఇంకొన్ని గంటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ నటించే సినిమా మీద ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంది. వంశీపైడిపల్లి సినిమా…అనిల్ రావిపూడి సినిమా..కొరటాలశివ చిరంజీవి సినిమా ..అంటూ వార్తలు వచ్చినమాట వాస్తమే.

 

కాని అధికారకంగా మాత్రం ఏది వెల్లడి కాలేదు. దాంతో ఫ్యాన్స్ లో కొంత సందిగ్ధత నెలకొంది. అయితే గత నాలుగైదు రోజులుగా మాత్రం ఖచ్చితంగా మే 31 న సూపర్ స్టార్ కొత్త సినిమా అప్‌డేట్ వస్తుందన్న వార్త వచ్చి కాస్త ఊరటనిచ్చింది.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు పరశురామ్ సినిమా కి సంబంధించి టైటిల్ విషయంలో అలాగే మహేష్ పాత్ర గురించి .. ఈ సినిమా కథా నేపథ్యం ఇదే అంటూ ..సంగీత దర్శకుడు ఇతనే ..హీరోయిన్ తనే …ఇలా రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో అఫీషియల్ అనౌన్స్ మెంట్ అంటూ మేకర్స్ SSMB 27 సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన వచ్చే సమయం .. ఉదయం 09.09 తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుకుంటున్న అన్ని వార్తలకి సమాధానం రేపు రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version