కోడిగుడ్లు తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్లను వైద్యులు సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అందుకనే నిత్యం గుడ్లను తినమని సూచిస్తుంటారు. వాటి వల్ల కాల్షియం, ఎన్నో విటమిన్లు మన శరీరానికి అందుతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కానీ కొందరు మాత్రం కోడిగుడ్లను తినడం వల్ల మలబద్దకం వస్తుందని అపోహలకు గురవుతుంటారు. అయితే ఇందులో నిజం ఉందా ? నిజంగానే వాటిని తింటే మలబద్దకం వస్తుందా ? దీనిపై వైద్యులు ఇస్తున్న వివరణ ఏమిటంటే…
కోడిగుడ్లను తినడం వల్ల మలబద్దకం రాదు. కానీ కింది చర్యల వల్ల మలబద్దకం వస్తుంది. అవేమిటంటే…
* నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) కూడా ఉండాలి. అది లేకపోయినా.. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్ల వంటి ఆహారాలను నిత్యం తీసుకున్నా.. మలబద్దకం వస్తుంది. అదే ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకుంటే పెద్ద పేగులో మలం కదలిక సరిగ్గా ఉంటుంది. అందువల్ల మలబద్దకం ఏర్పడదు. కనుక కేవలం గుడ్లను తినడం వల్లే మలబద్దకం వస్తుందనేది అపోహ మాత్రమే.
* కోడిగుడ్లను చికెన్, మటన్ వంటి మాంసాహారాలతో కలిపి తింటే మలబద్దకం వస్తుంది. వాటిని కలపకుండా ఉంటే కోడిగుడ్లతో మలబద్దకం రాదు.
* కోడిగుడ్లను తిన్నాక కాఫీ, టీ వంటి పానీయాలను తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. మలబద్దకం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ కేవలం కోడిగుడ్లను తినడం వల్లే ఆ సమస్య రాదు.
పైన తెలిపిన సందర్భాల్లో మలబద్దకం వచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ.. కేవలం కోడిగుడ్లను తింటే ఆ సమస్య రాదు. కనుక కోడిగుడ్లను తినే విషయంలో ఈ అపోహ పెట్టుకోవాల్సిన పనిలేదు.