Samantha : వైరల్ అవుతున్న సమంత పాత ఫోటోలు !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ జిమ్ లో కసరత్తులు చేస్తూ తన తదుపరి సినిమాల కోసం రెడీ అవుతోంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో కూడా త్వరలోనే పాల్గొనబోతున్నట్లు తెలిపింది.

తాజాగా సమంత ‘సిటాడెల్‌’ కోసం రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోని ఆమె తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేసింది. సామ్ కు సిటాడెల్ టీమ్ హీరో వరుణ్ ధావన్, ప్రొడ్యూసర్లైన రూసో బ్రదర్స్, డైరెక్టర్ రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో సామ్ నటిస్తుండటంతో సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సమంతకు అభినందనలు చెప్పారు. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు సమంత పాత ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.