ఇవాళ అమృత్‌సర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. ఇండియా వర్సెస్ పాక్ మధ్య గొడవలు ఉన్న తరుణంలో ఇవాళ అమృత్‌సర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. దింతో విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని ఆదేశించారు. బ్లాకౌట్ ఉంటే అందరూ సహకరించాలన్న అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్.. అన్ని పాఠశాలలు మూసివేయాలన్నారు.

ఇక అటు ఇవాళ భారత్-పాక్ మధ్య కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇవాళ భారత్-పాక్ మధ్య కీలక చర్చలు జరుగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు ఉంటాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గింపు అంశాలపై చర్చ జరుగనుంది.
ఇవాళ్టి చర్చలు కాల్పుల విరమణకే పరిమితం అవుతాయంటున్నాయి రక్షణశాఖ వర్గాలు. మొన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది సిజ్ ఫైర్. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్..ఇండియా పై దాడి చేసే కుట్రలు చేసింది. కానీ ఇండియా తరిమి కొట్టింది.