త్వరలో ఓటీటీలో అక్షయ్‌ కుమార్ ‘OMG2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

-

బాలీవుడ్లో హీరో అక్షయ్ కుమార్​ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు అక్షయ్. ఇక అందులో కనీసం ఒక్కటైన కలెక్షన్ల వర్షం కురిపించడం పక్కా. అయితే గత కొంతకాలంగా అక్షయ్​కు సరైన హిట్ లేదు. అయినా సరే ఈ హీరో దూకుడు మాత్రం తగ్గడం లేదు. వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ తన హవా కొనసాగిస్తున్నాడు.

ఇక బీ టౌన్​లో ఓ మైగాడ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు వచ్చిన క్రేజ్​తో సీక్వెల్ ప్లాన్ చేసారు దర్శకనిర్మాతలు. ఆ సీక్వెల్ ఓ మై గాడ్-2లో అక్షయ్ కుమార్ నటించాడు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిక్స్​డ్ టాక్​ను సొంతం చేసుకుంది. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ దేవుడి పాత్రలో కనిపించి సందడి చేశాడు. అక్షయ్​తో పాటు పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ‘OMG2’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు రంగం రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబరు 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news