దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. బాహుబలి తరువాత రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడం… రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాగా రావడంతో అందరిలోనూ భారీ అంచానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ట్రిపుల్ ఆర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ చూసిన వాళ్లు సూపర్ డూపర్ హిట్ అంటూ ప్రశంసిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంతో పాటు ఇద్దరు హీరోల యాక్టింగ్ సూపర్ అంటున్నారు. దీంతో తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందని చాలా మందిలో ఆసక్తి నెలకొంది. గతంలో ప్రకటించన విధంగానే మూడు నెలల వరకు ట్రిపుల్ ఆర్ ఏ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో రిలీజ్ కాదని తెలుస్తోంది. దీంతో మూడు నెలల తరువాత ఓటీటీల్లో ట్రిపుల్ ఆర్ రానుంది. జూన్ తరువాతే ఓటీటీ ల్లోకి రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం వెర్షన్లను జీ5 కొనుగోలు చేయగా… హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.