తెలుగు సినిమా సాహిత్యం అంటే గుర్తొచ్చే పేర్లలో ఒకటి సిరివెన్నెల సీతారామశాస్త్రి. తన మొదటి సినిమాతోనే విధాత తలపున ప్రభవించినది అంటూ తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త కళ తెచ్చారు సీతారామశాస్త్రి. అందుకే అప్పటిదాకా చెంబోలు సీతారామశాస్త్రిగా ఉన్న ఆయన కాస్త సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారారు.
పెన్ను పవర్ తో తెలుగు సాహితి ప్రపంచానికి తన సత్తా చాటిన సిరివెన్నెలకు కేంద్ర ప్రభుత్వం పర్మశ్రీ ప్రకటించింది. ఆయన కలం నుండి ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయాయి. టెలికాం డిపార్ట్ మెంట్ లో సాధారణ ఉద్యోగిగా ఉన్న సీతారామశాస్త్రి ఆయన రాసిన గంగావతరణం గేయాన్ని చూసి దర్శకుడు కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాలో అవకాశం ఇచ్చారు.