ప్రభాస్ కి గట్టి షాక్ ఇచ్చిన పఠాన్ డైరెక్టర్.. ఏమైందంటే..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబలి చిత్రంతో మారిపోయిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే సాహో, రాధే శ్యామ్ చిత్రాలకు అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కే ,స్పిరిట్, ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలను లైన్ అప్ లో పెట్టాడు. ఇదిలా ఉండగా పఠాన్ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ సైతం తాజాగా ప్రభాస్ కి స్టోరీ వినిపించాడు.

అయితే ప్రభాస్ సినిమా కోసం ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషకం విని ప్రభాస్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళితే టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్ చాలా కాలం క్రితమే ప్రభాస్ కి అడ్వాన్స్గా 25 కోట్ల రూపాయలు ఇచ్చిందట. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనుందని దీనికి బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ దర్శకత్వం వహించనున్నారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు సిద్ధార్థ చెప్పిన స్క్రిప్ట్ కి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఇదే ఏడాది అనౌన్స్ చేసి వచ్చే యేడాది షూటింగ్ మొదలు పెట్టడానికి నిర్మాతలు కూడా ప్లాన్ చేస్తున్నారు.

ఇక్కడ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ అయితే రేమ్యునరేషన్ గా ఏకంగా రూ. 150 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇది విన్న ప్రభాస్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ కూడా షాక్ అయ్యారట. ముఖ్యంగా మరోవైపు ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా రూ.150 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటే బడ్జెట్ ఎంత అవుతుంది అనే విషయంపై మేకర్ లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పఠాన్ మూవీ రిజల్ట్ తో డైరెక్టర్ కూడా రెమ్యునరేషన్ పెంచేస్తున్నాడని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news