ప‌విత్ర ఆంటీని హీరోయిన్ ని చేస్తామ‌న్న‌ హీరోలు!

-

ప‌విత్ర లోకేష్ తెలుగు వారికి సుప‌రిచితురాలు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోల‌కు త‌ల్లిగా..అప్పుడ‌ప్పుడు అక్క పాత్ర‌ల్లో న‌టిస్తుంటుంది. తెలుగులో చాలా సినిమాలు చేసింది. మాతృభాష క‌న్న‌డలోనూ స‌త్తా చాటింది. అంద‌మైన ఆంటీగాను ప‌విత్ర‌కు మంచి పేరు ఉంది. అయితే ప‌విత్ర‌ను కొంత మంది టాలీవుడ్ హీరోలు త‌మ తో క‌లిసి రొమాన్స్ చేయాల్సింది గా కోరారుట‌. అంటే త‌మ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ ఇస్తాం…నువ్వే న‌టించొచ్చు గానీ అని అడిగేవారుట‌. ఎవ‌రో తెలియ‌ని కొత్త అమ్మాయిని పెట్టుకుంటున్నాం….తెలిసిన నిన్నే హీరోయిన్ గా పెట్టుకుంటే బాగుంటుంద‌ని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారుట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప‌విత్ర లోకేష్ ఓ ఇంట‌ర్వూలో తెలిపింది.

అలాగే ఆమె వ‌య‌సు ఎంత అనుకుంటున్నారు? స్టిల్ 39 అట‌. ఒక హీరోను కూడా ఉద‌హ‌రించి మాట్లాడింది. సిద్ధార్థ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బావ సినిమాలో ప‌విత్ర హీరోకి త‌ల్లి పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సిద్ధార్థ్ త‌న క‌న్నా నాలుగేళ్లు పెద్ద‌వాడని తెలిపింది. అలాగే టాలీవుడ్ లో చాలా మంది హీరోలు త‌న‌కంటే పెద్ద వారేన‌ని తెలిపింది. వాళ్ల‌కు అమ్మ‌గా న‌టించ‌డం త‌న‌కే ఆశ్చ‌ర్య‌గా ఉంద‌ని తెలిపింది. అయితే త‌ల్లి పాత్ర‌లు త‌న‌కెంతో సంతృప్తినిచ్చాయ‌ని అంది. హీరోయిన్ గా న‌టించాలంటే లిప్ లాక్ లు..బెడ్ రూమ్ స‌న్నివేశాల్లో న‌టించాలి. త‌ల్లి పాత్ర‌ల‌కంటే అలాంటి స‌మ‌స్య‌లుండ‌వి కాబ‌ట్టి అవే ఉత్త‌మం అని తెలిపింది.

హీరోయిన్ కెరీర్ క‌న్నా త‌ల్లి పాత్ర‌ల‌కే ఎక్కువ‌గా లైఫ్ ఉంద‌ని అభిప్రాయ ప‌డింది. ఇక ప‌విత్ర తండ్రి స్టేజ్ ఆర్టిస్ట్. అక్క‌డ నుంచి సినిమాల్లోకి వ‌చ్చి 200 చిత్రాల్లో న‌టించారు. సంప్ర‌దాయ బ్రాహ్మాణ కుటుంబంలో జ‌న్మించింది. అయితే తండ్రి మ‌ర‌ణంతో ప‌విత్ర ప‌రిస్థితులు మారిపోయాయి. సినిమాల్లోకి అనుకోకుండా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమె మోస‌పోయిన సంద‌ర్భాలున్నాయి. త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తినే పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డింది. ఆ మ‌ధ్య కాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా ప‌విత్ర త‌న అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news