పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. తమిళ సినిమాల షూటింగ్‌లు ఆ రాష్ట్రంలోనే తీయాలని, అందులో పనిచేసేవారు తమిళులై ఉండాలని ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) తెచ్చిన నిబంధనపై పవన్ మాట్లాడారు.
టాలీవుడ్‌లో అన్ని భాషల వారు పనిచేస్తారని.. అలాగే.. కేరళ నుంచి వచ్చిన సుజిత్ వాసుదేవన్, ఉత్తరాది నుంచి ఊర్వశీ రౌతేలా, అలాగే పక్క దేశానికి చెందిన కొందరు కాస్టూమ్ డిజైనర్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమ కూడా ఇదే విధంగా అందరికీ అవకాశాలు కల్పించాలని సూచించారు. అన్ని భాషల వాళ్లు ఉంటేనే అది సినిమా అవుతుందని.. కేవలం ఒక ప్రాంతం వాళ్లు మాత్రమే ఉండాలని అనుకోకూడదని చెప్పారు.
మరింత విస్తృత పరిధిలో ఆలోచిస్తే కోలీవుడ్ నుంచి కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలు వస్తాయన్నారు. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికుల సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కారించాలని.. దానికి ప్రత్యామ్నాయంగా ఇతర ఉపాయాలను ఆలోచించాలని ని పవన్ కల్యాణ్ కోలీవుడ్ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.