వచ్చే ఎన్నికల్లో పోటీపై దగ్గుబాటి పురంధేశ్వరి కీలక ప్రకటన

-

వచ్చే ఎన్నికల్లో పోటీపై ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక ప్రకటన చేశారు. తూర్పుగోదావరి రాజమండ్రిలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటించి..మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీతో నిన్న..ఇవాళ…. రేపు కూడా పొత్తు ఉంటుందని.. మిగిలిన పార్టీలతో పొత్తు కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే మా లక్ష్యం అన్నారు పురందేశ్వరి.

పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని.. పంచాయతీల పరిస్థితి దీనికి ప్రధాన ఉదాహరణ అన్నారు. నేను పార్టీ అధ్యక్షురాలు అయ్యాక మొదట రాష్ట్రంలో పంచాయతీల అంశాన్ని తీసుకున్నానని చెప్పారు. సర్పంచులకు ఆంధ్రప్రదేశ్ బిజెపి సంపూర్ణంగా మద్దతు అందిస్తుందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి సిద్థంగా ఉన్నామన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Latest news