నాగబాబు పై పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్ !

-

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్ చేశారు. అన్నయ్య నాగబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టారు పవన్. నా చిన్ననాటి నుంచి నేటి వరకు నా వెన్నంటే ఉన్న నాగబాబు గారు నాకు ఎన్నో విషయాలలో స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా నాకు పుస్తక పఠనంపై అమితాసక్తి కలగడానికి కారకులైన వారిలో నాగబాబు కూడా ఒకరు అని తెలిపారు. న్యాయ విద్యను అభ్యసించిన నాగబాబు రాజ్యాంగపరమైన విషయాలు, సమకాలీన సామాజిక పరిస్థితులపై నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉంటారన్నారు.

ప్రముఖ న్యాయ కోవిదుడు శ్రీ నాని పాల్కీవాలా రచించిన వియ్ ది నేషన్ పుస్తకాన్ని నాకు బహూకరించి ‘ఈ పుస్తకం చదువు నీకు ఎంతో ఉపయోగపడుతుంది’ అని శ్రీ నాగబాబు గారు చెప్పిన మాటలు నాకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయని వెల్లడించారు. రాజకీయ విషయాలలో చక్కటి అవగాహన, పరిజ్ఞానం ఉన్న శ్రీ నాగబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి జన సైనికులకు ఎంతో సేవ చేస్తున్నారు. అన్నయ్య శ్రీ నాగబాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నా తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news