టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు రాజకీయాలలో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఇప్పటికే ఒక సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. మిగిలిన మూడు సినిమాలు కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎవరు మాట్లాడినా సరే ఆయన మూడు పెళ్లిళ్ల గురించే ప్రస్తావన తీసుకొస్తూ ఆయనను విమర్శిస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తే.. ఈయన ఏకంగా మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు.
అందులోనూ ఒకరు తెలుగు, మరొకరు మరాఠీ, ఇంకొకరు రష్యన్. ఇలా ప్రపంచం మొత్తాన్ని పవన్ తన పెళ్లిళ్ళతో కవర్ చేశాడు అంటూ కొంతమంది రకరకాల కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఈయనకు ఇంకొంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు కూడా సృష్టించారు. ఉదాహరణకు వకీల్ సాబ్ సినిమాని తీసుకోవచ్చు. స్టోరీకి హీరోయిన్ అవసరం లేకపోయినా శృతిహాసన్ ని ఇందులో తీసుకొచ్చారు. ఒక పాట , లవ్ ట్రాక్ కూడా పెట్టారు. అలాగే జల్సా సినిమా కూడా ఒకటి. త్రివిక్రమ్ పుణ్యమా అని అది కూడా కాస్త విజయం సాధించింది.
ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా, పార్వతి మెల్టన్ నటించిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్, పార్వతికి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా వినిపించాయి. జల్సా సినిమా రిలీజ్ అయిన సందర్భంగా పార్వతి మెల్టన్ వద్దంటున్నా కూడా రూ.24 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ని పవన్ కళ్యాణ్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారట. అప్పట్లో ఈ విషయం కాస్త చాలా హాట్ టాపిక్ గా మారింది.