అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానుల ఆరాధ్య దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈయన చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని అభిమానులుగా మార్చుకున్నారు. ముఖ్యంగా చాలామంది కి పవన్ కళ్యాణ్ ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. కెరీర్ మొదట్లో సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఆయన తన అన్న మెగాస్టార్ భార్య సురేఖ చొరవతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే పర్వాలేదనిపించుకొని ఆ తర్వాత భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.

డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈయన ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలు అంటూ బిజీగా మారిపోయారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారింది. ఒకానొక సమయంలో ఒక వ్యాధితో నరకయాతన అనుభవించారట పవన్ కళ్యాణ్. తాను చదువుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఆస్తమాబారిన పడ్డట్టు దానివల్ల ఎంతో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. అంతేకాదు ఒకవైపు ఆస్తమా మరొకవైపు పరీక్షల ఒత్తిడితో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఆయన అదే సమయంలో సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నారట.

ఇక అప్పుడు ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలుపెట్టి సొంతంగా నేర్చుకునే అలవాటును అలవర్చుకున్నారు. ఇక అలా మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించి నెమ్మదిగా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ఈ సమస్య ఇప్పటికీ అప్పుడప్పుడు వేధిస్తుంది అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ వార్త ఆయన అభిమానులను కలవరపెడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version