ఎడిట్ నోట్: కాంగ్రెస్..మూడోసారి..?

-

తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్…కానీ అక్కడ గెలుపు కోసం దాదాపు 9 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉంది. ఓ వైపు కే‌సి‌ఆర్ ఎత్తులకు కాంగ్రెస్ చిత్తు అవుతూ వస్తుంది. ఆ పార్టీలోనే నేతలని లాగేసి..చాలావరకు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశారు. అయినా సరే ఏదొక విధంగా నిలదొక్కుకుని మళ్ళీ సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇప్పటికే రెండు సార్లు వరుసగా ఓడిపోయి అధికారానికి దూరమైంది. ఇప్పుడు మూడోసారి పోరాటం మొదలుపెట్టింది. ఈ సారి కూడా గెలవకపోతే ఇంకా కాంగ్రెస్ పని అంతే సంగతులు.

1994, 1999 ఎన్నికల్లో టి‌డి‌పి హవాలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ చిత్తు అయింది. కానీ కాంగ్రెస్‌కు వైఎస్సార్ పాదయాత్రతో ఊపిరి పోశారు. ఇటు డి.శ్రీనివాస్ వ్యూహాలు పార్టీకి ప్లస్ అయ్యాయి. సీనియర్ నేతలు కష్టపడ్డారు. టి‌డి‌పి వైఫల్యం..కాంగ్రెస్‌కు కలిసొచ్చింది..2004లో అధికారంలోకి వచ్చింది. ఇక 2009లో కేవలం వైఎస్సార్ హవాతో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ చనిపోవడంతో కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ఇటు వైఎస్సార్ తనయుడు జగన్ సెపరేట్ పార్టీ పెట్టుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారైంది.

ఇదే సమయంలో అటు తెలంగాణ ఉద్యమం..ఈ క్రమంలో తెలంగాణ ఇస్తే అక్కడ పార్టీ మళ్ళీ గెలుస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ వైపు మొగ్గు చూపారు. కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడుగా 2014లో ప్రజలు కే‌సి‌ఆర్‌కు మద్ధతు ఇచ్చారు. మళ్ళీ 2018 ఎన్నికల్లో కూడా ఆయనకే మద్ధతు తెలిపారు. ఇలా రెండు సార్లు కాంగ్రెస్ ఓటమిని చూసింది.

ఇప్పుడు మూడోసారి పోరాటం మొదలుపెట్టింది. ఈ సారి గెలవకపోతే ఇంకా కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే సీనియర్లు అంతా కలిసికట్టుగా పనిచేసేలా ముందుకెళుతున్నారు. ఇటు కర్నాటకలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చిన డి‌కే శివకుమార్‌కు టీ. కాంగ్రెస్‌ని గెలిపించే బాధ్యతలు అప్పగించారు. అటు ప్రియాంక గాంధీ ప్రచార బాధ్యతలు చూసుకుంటారు. ఇక వీరంతా కలిసి ఈ సారైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version